ఇరాన్‌లో భూకంపం.. భయంతో పరుగులు

13 Dec, 2017 16:09 IST|Sakshi

టెహ్రాన్‌ : ఇరాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై 6.1తీవ్రతతో ఏర్పడిన ఈ భూకంపం కెర్మాన్‌ ప్రావిన్స్‌లోని హజ్‌డాక్ అనే గ్రామాన్ని తాకింది. భూకంప శాస్త్రవేత్తల వివరాల ప్రకారం బుధవారం ఉదయం టెహ్రాన్‌కు 700 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం చోటు చేసుకుంది. 10 కిలో మీటర్ల లోతులో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించామని అది సంభవించగానే ఇళ్లల్లో నుంచి జనాలు బయటకు పరుగులు తీశారని చెప్పారు.

దీనికారణంగా దాదాపు 60 మందిగాయాలపాలయ్యారని, ఆస్తి నష్టం కూడా చోటు చేసుకున్నట్లు తెలిపారు. తొలుత 6.1 తీవ్రతతో వచ్చిన భూకంపం కాస్త తర్వాత 4 తీవ్రతతో ఓసారి 5.1 తీవ్రతతో మరోసారి ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్‌లోనే 7.2తీవ్రతతో ఏర్పడిన భూకంపం భారీ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దీని కారణంగా 600మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక 2003లో ఏర్పడిన 6.6 తీవ్రతతో ఏర్పడిన భూకంపం పెను విధ్వంసాన్నే సృష్టించి 26వేలమందిని బలితీసుకుంది.

మరిన్ని వార్తలు