భారత ఐటీ నిపుణులకు మరో బ్యాడ్‌ న్యూస్‌

27 May, 2019 19:55 IST|Sakshi

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్‌1బీ వీసాదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు. తాజాగా  హెచ్‌1బీ వీసా కలిగివున్న వారి జీవిత భాగస్వామి (భార్య లేదా భర్త), 21 సంవత్సరాల లోపు పిల్లలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నిషేధించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ లాండ్‌ ప్రతిపాదన రెండవ దశకు చేరుకుంది. హెచ్‌4 వీసాలపై నిషేధం విధించే ప్రక్రియలోభాగంగా మే 22న  అమెరికా ప్రభుత్వం ఒక నోటీసును కూడా జారీ  చేసింది.

ఇది చట్టం రూపంలో అమల్లోకి వస్తే అమెరికాలో  పనిచేస్తున్న దాదాపు లక్షకు పైగా  ఉద్యోగులు తమ  ఉద్యోగాలను కోల్పోనున్నారు. ప్రధానంగా భారతీయులే ఎక్కువగా నష్టపోతారు. 2015 నుంచి హెచ్‌-4 వీసా కింద అమెరికాలో 1.2 లక్షల మంది ఉద్యోగం చేస్తున్నారు. వీరిలో 90శాతం మంది భారతీయులే. ముఖ్యంగా భారత మహిళలే. ఏదేమైనా, ఈ ప్రతిపాదన పూర్తయ్యి,  అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే..ఫెడరల్ రిజిస్టర్లో పోస్ట్ చేస్తారు. వీటిపై ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేసేందుకు 30-60 రోజుల వరకు గడువు వుంటుంది. అనంతరం దీనిపై చట్టం తీసుకొస్తారు. అయితే ఇదంతా జరిగేందుకు కనీసం ఏడాది సమయం పడుతుందని ఇమ్మిగ్రేషన్.కామ్ మేనేజింగ్ అటార్నీ రాజీవ్‌ ఎస్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. దీని ద్వారా అమెరికాలో ఐటీ నిపుణుల కొరత ఏర్పడుతుందనీ,  తద్వారా అమెరికా ఉద్యోగాలను తిరస‍్కరించే పరిస్థితి వస్తుందన్నారు.

కాగా హెచ్‌-1బీ వీసాదారుల భాగస్వాములు, గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూసే వారి జీవిత భాగస్వాములు అమెరికాలోని కంపెనీల్లో పనిచేసేందుకు హెచ్‌-4 డిపెండెంట్‌ వీసాల కింద వీలు కల్పిస్తూ 2015లో ఒబామా ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ విధానాన్ని తొలగిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గతంలో ప్రకటించారు.  భారత సంతతికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు సంఘాలనుంచి  తీవ్ర   వ్యతిరేకత వ్యక్తమవువుతున్నప్పటికీ అమెరికా యువతకు ఉద్యోగాలు కల్పించేందుకే ఈ నిబంధనలు తీసుకొస్తున్నట్లు ట్రంప్‌ సర్కార్‌ చెబుతున్న సంగతి తెలిసిందే.  

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతరిక్ష పంట.. అదిరెనంట!

సోషల్‌ మీడియాతో చిన్నారుల్లో మానసిక రుగ్మతలు

అంతర్జాతీయ కోర్టులో భారత్‌కు విజయం

నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..

అంతుచిక్కని రోగం: ముఖం భయంకరంగా..

గ్లోబల్‌ టెర్రరిస్ట్‌ హఫీజ్‌ సయీద్‌ అరెస్ట్‌

నిర్లవణీకరణకు కొత్త మార్గం!

భారత్‌కు దావూద్‌ కీలక అనుచరుడు!

ఇదో ఘనకార్యమైనట్టు.. ఇలా ఫొటో దిగారు!!

40 కేజీల లగేజీ తీసుకెళ్లొచ్చు!

పోయిందే.. ఇట్స్‌గాన్‌..

పెట్‌ యువర్‌ స్ట్రెస్‌ అవే!

హత్య చేసి.. శవంపై అత్యాచారం

అమెరికా, రష్యాల మధ్య నూతన ఒప్పందం

విడాకులు కోరినందుకు భార్యను...

పర్యాటకులకు కొద్దిదూరంలోనే విమానం ల్యాండింగ్‌!

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

ప్రైమ్‌ డే సేల్ ‌: అమెజాన్‌కు షాక్‌

ఎయిరిండియాకు భారీ ఊరట

ప్రాచీన పిరమిడ్‌ సందర్శనకు అనుమతి

యాంగ్‌ యాంగ్‌ బీభత్సం.. ఎగిరెగిరి తన్నుతూ..

హఫీజ్‌ సయీద్‌కు బెయిల్‌

ఇటలీ టమోటాలకు నెత్తుటి మరకలు

వదలని వాన.. 43 మంది మృతి..!

బుర్ర తక్కువ మనిషి; అయినా పర్లేదు..!

ఫేస్‌బుక్‌కు రూ.34 వేల కోట్ల జరిమానా!

అక్రమ వలసదార్ల అరెస్టులు షురూ

సోమాలియాలో ఉగ్రదాడి

మొసలిని మింగిన కొండచిలువ!

స్త్రీల లోదుస్తులు దొంగిలించి.. ఆ తర్వాత...

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌