పెను ప్రమాదంలో అరటి పండు

8 Jul, 2018 17:06 IST|Sakshi
అరటి పండ్లు

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : పండ్లలో అందరికీ ప్రీతిపాత్రమైనది అరటి పండు. అలాంటి అరటి పండు భవిష్యత్‌ తరాలకు అందుబాటులో ఉండదా?. శాస్త్రవేత్తలు ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఓ ట్రాపికల్‌ వ్యాధి అరటి పంటను పట్టి పీడిస్తోంది. పరిస్థితి ఇలానే కొనసాగితే అరటి పండును భవిష్యత్‌లో చూడలేమని శాస్త్రేవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఏంటా వ్యాధి?
పనామా వ్యాధి ఆఫ్రికా, ఆసియా ఖండాల్లో అతి వేగంగా వ్యాప్తి చెందుతోంది. పనామా వ్యాధి ఫంగల్‌ జాతికి చెందినది. పనామా వ్యాధి అరటి చెట్టు వేర్లపై ప్రభావం చూపి దాన్ని చనిపోయేలా చేస్తుంది.

భయాందోళనలు
ఆసియా, ఆఫ్రికాల్లో విపరీతంగా ప్రభావం చూపుతున్న పనామా వ్యాధి దక్షిణ అమెరికా ఖండానికి సోకుతుందేమోనని భయపడుతున్నారు. దక్షిణ అమెరికాలో కావెండిష్‌ అరటి పండ్లు బాగా ఫేమస్‌. అత్యంత రుచికరంగానూ ఉంటాయి. పనామా వ్యాధి వల్ల ఈ పండు అంతరించి పోయే ప్రమాదం ఉంది.

అయితే, చిమ్మచీకట్లలో వెలుగులా మెడగాస్కన్‌ అరటి పండు పరిశోధకుల ఆశలు రేకెత్తిస్తోంది. పనామా వ్యాధిని తట్టుకుని నిలబడగల శక్తి ఈ అరటికి ఉంది. అయితే, కారడవిలో ఉన్న అరటిని ప్రజలకు అందేలా చేయడం అతి కష్టమైన పని.

మరిన్ని వార్తలు