రక్త పరీక్షతో.. అకాల మరణాన్ని గుర్తించొచ్చు!

23 Oct, 2015 13:31 IST|Sakshi
రక్త పరీక్షతో.. అకాల మరణాన్ని గుర్తించొచ్చు!

మెల్బోర్న్: ఒక్క రక్త పరీక్షతోనే  అకాల మరణానికి గల అవకాశాలను గుర్తించవచ్చని చెబుతున్నారు మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. 10,000 మంది వ్యక్తుల రక్తనమూనాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ ఫలితాలను గుర్తించారు. మెల్బోర్న్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 'గ్లిక్-ఏ' అనే మాలిక్యులార్ బై ప్రొడక్ట్ను కొత్తగా గుర్తించారు. రక్తంలో గ్లిక్-ఏ పరిమాణం అధికంగా ఉన్న వారిలో రానున్న 14 సంవత్సరాల కాలంలో వివిధ వ్యాదులు, ఇన్ఫెక్షన్ల బారిన పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పరిశీలనలో తేలింది. ఈ ఇన్ఫెక్షన్లు అకాల మరణానికి దారితీసేంత తీవ్రమైనవిగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.


మెల్బోర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త మైకెల్ ఇనోయ్ మాట్లాడుతూ.. ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి ఈ పరిశోదన ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్లిక్-ఏ పై మరింత పరిశోధన జరగాల్సిన అవసంరం ఉందని తెలిపారు. రక్తంలో దీని పరిమాణంను అధిక మోతాదులో గుర్తించినట్లయితే ప్రాణాంతక వ్యాధులకు దగ్గరగా ఉన్నట్లు భావించాల్సి ఉంటుందన్నారు.
 

మరిన్ని వార్తలు