పెట్.. అంత్యక్రియలకు ఆరువేల మైళ్ళ ప్రయాణం

22 Nov, 2015 00:03 IST|Sakshi
పెట్.. అంత్యక్రియలకు ఆరువేల మైళ్ళ ప్రయాణం

అది.. ప్రేమకు ప్రతిరూపమైన సన్నివేశం. హృదయాన్ని కదిలించే... మనసును కరిగించే సంఘటన. విశ్వాసాన్ని చాటిన పెంపుడు కుక్కకు యజమాని పంచిన అభిమానం. ప్రియమైన నేస్తానికి కన్నీటి వీడ్కోలు పలికిన మానవీయ కోణం... కేవలం కుక్కను ఖననం చేయడానికి స్మశానంకోసం ఆరువేల మైళ్ళు ప్రయాణించిన కథనం...

గోల్డెన్ రిట్రైవర్ జాతికి చెందిన ఆ పెంపుడు జంతువు మరణం.. యజమాని కుటుంబాన్ని కన్నీటి సంద్రంలో ముంచేసింది. హాంకాంగ్లో నివసించే ఎలైన్ కాయో.. ప్రియమైన పెంపుడు కుక్క... డేవిడ్ మరణించింది. ఎంతో ప్రేమతో ఇంట్లోని మనిషిలా పెంచుకున్నఆ శునకాన్ని ఖననం చేసేందుకు యజమానికి స్థలం దొరకలేదు. దీంతో దాన్ని పూడ్చేందుకు ఆరువేల మైళ్ళు విమానంలో నార్త్ వేల్స్ హోలీవెల్ వరకూ ప్రయాణించడం అందర్నీ ఆశ్చర్యపరచింది. కుక్కకు అంతిమ సంస్కారాలు చేయడంలో భాగంగా శవపేటికను ఊరేగిస్తున్నపుడు స్థానిక జనం నివ్వెరపోయి చూశారు. ''ఐ విల్ ఆల్వేస్ లవ్ యు'' అంటూ యజమాని బాధతో చేసిన ప్రార్థనలు అందర్నీ కన్నీరు పెట్టించింది.

అయితే పెంపుడు జంతువును ఎంతో ప్రేమతో పదమూడేళ్ళ పాటు పెంచిన యజమాని కాయో... పాపం ఆ విశ్వాసపాత్రురాలి అంత్యక్రియలకు హాజరు కాలేకపోయింది.  హాంకాంగ్ లో నివసించే ఎలైన్ కాయో స్థానికంగా తన కుక్క డేవిడ్ కు అంత్యక్రియలు జరిపేందుకు స్థలం లేకపోవడంతో వెబ్ లో నమోదు చేసింది. నార్త్ వేల్స్.. హోలీ వెల్ లో డేవిడ్ చివరి మజిలీకి స్థలం ఉన్నట్లుగా తెలియడంతో విమానంలో అక్కడి 'పెట్ సెమెటరీ'కి తరలించాల్సి వచ్చింది. అంతటి దూరాభారం ప్రయాణించాల్సి రావడంతో  డేవిడ్ అంత్యక్రియలకు కాయో  వెళ్ళలేకపోయింది.

జంతువులను సమాధి చేసేందుకు స్థలం లేకపోవడంతో.. పదమూడేళ్ళు ఎంతో ప్రేమగా పెంచుకున్న కుక్కను స్వదేశంలో ఖననం చేయలేకపోవడం నన్ను ఎంతో బాధించిందని, దాని అంత్యక్రియల కోసం ఇంటర్నెట్ ను ఆశ్రయించాల్సి రావడం భరించలేకపోయానని  కాయో తీవ్రంగా చింతిస్తోంది. రంగు రంగుల బొమ్మలు పేర్చిన శవ పేటికలో ఉంచి... ఫొటోలు తీస్తూ, ప్రార్థనలు చేస్తూ నగర వీధుల్లో ఊరేగిస్తూ..  ఓ గంభీరమైన వాతావరణంలో సంగీతాన్ని పాడుతుండగా... చాపెల్ లో డేవిడ్ శరీరం  బ్రిన్ ఫోర్డ్ స్మశానానికి చేర్చారు.

తీవ్ర శోకంలో ఉన్న నేను... నా ఇద్దరు పిల్లలు డేవిడ్ అంత్యక్రియలకు హాజరు కాలేకపోవడంతో మా తరపున ప్రాతినిధ్యం వహించే ఓ మధ్యవర్తిని పంపించామని కాయో బాధతో చెప్తోంది. డేవిడ్ సమాధిపై బంగారు అక్షరాలతో... ''అత్యంత సాహసోపేతమైన, డియరెస్ట్ డేవిడ్ కు శాల్యూట్ అని.. మా జీవితాల్లో అత్యుత్తమ, నమ్మదగిన స్నేహితుడికి నివాళులు'' అంటూ రాయడం.. పెంపుడు జంతువుపై యజమానికి ఉన్న ప్రేమాభిమానాలను చాటుతోంది.

మరిన్ని వార్తలు