సైబర్‌ దాడులకు హ్యాకర్స్‌ వ్యూహం

19 Jun, 2020 22:04 IST|Sakshi

ముంబై: భారత్‌, చైనా సరిహద్దులో గాల్వనా లోయలో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌ను దెబ్బతీసేందుకు చైనా హ్యాకర్స్ వ్యూహ్యాలు రచిస్తున్నాయి. దేశీయ ప్రభుత్వ సంస్థలు, మీడియా, ఫార్మా, టెలికాం తదితర రంగాల సహచారాన్ని తెలుసుకోవడానికి సైబర్‌ దాడులు చేయాలని చైనాకు చెందిన హ్యాకర్స్ వ్యూహాలు రచిస్తున్నట్లు సైబర్‌ ఇంటలిజన్స్‌ సంస్థ సిఫర్మా తెలిపింది. అందులో భాగంగానే సమాచారాన్ని హ్యాక్‌ (రహస్యంగా తెలుసుకోవడానికి) చేయడానికి ప్రయత్నిస్తుందని సిఫర్మా పేర్కొంది.

సిఫర్మా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం చైనీస్‌ హ్యాకింగ్‌ గ్రూప్‌లు దేశంలోని మీడియా సంస్థలను దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపింది. చైనా ఆర్మీ ప్రవర్తనను దేశీయ మీడియా సమర్థంగా చూపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు మీడియా సంస్థలు చైనా హ్యాకర్స్‌ హిట్‌ లిస్ట్‌లో ఉన్నాయని సిఫర్మా సీఈఓ రితేష్‌ కుమార్‌ పేర్కొన్నారు. ఇటీవలే తమ దేశంలో సైబర్‌ దాడులు జరిగే అవకాశముందని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ పేర్కొన్న విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు