ట్రంప్‌ కమ్యూనికేషన్ల డైరెక్టర్‌గా స్కారాముచి

23 Jul, 2017 01:08 IST|Sakshi
ట్రంప్‌ కమ్యూనికేషన్ల డైరెక్టర్‌గా స్కారాముచి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన కమ్యూని కేషన్ల డైరెక్టర్‌గా వాల్‌ స్ట్రీట్‌ ఫైనాన్షి యర్‌ ఆంథోనీ స్కారా ముచిని శుక్రవారం నియమించారు. ఈ నియామకానికి అభ్యంతరం చెబుతూ తాత్కాలిక కమ్యూనికేషన్ల డైరెక్టర్, వివాదా స్పద వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సీన్‌ స్పైసర్‌ మీడియా కార్యదర్శి పదవికి  రాజీనామా చేశారు.

కొత్త మీడియా కార్యద ర్శిగా ప్రస్తుత డిప్యూటీ మీడియా కార్యదర్శి సారా హకబీ బాధ్యతలు చేపడతారు. అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యానికి సంబంధించి ట్రంప్‌ ప్రచార బృందంలోని పలువురు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్కారాముచి నియామకం జరిగింది. ఎక్స్‌పోర్ట్‌–ఇంపోర్ట్‌ బ్యాంక్‌ చీఫ్‌గా పనిచేస్తున్న ఆయన ఆగస్ట్‌ 15 నుంచి వైట్‌హౌస్‌ కమ్యూనికేషన్ల డైరెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు.

మరిన్ని వార్తలు