ఇరాన్‌ను వదలం: ట్రంప్‌

16 Jun, 2019 05:27 IST|Sakshi

వాషింగ్టన్‌ : ‘గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌’ ప్రాంతంలో రెండు చమురు నౌకలపై ఇరానే దాడిచేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపించారు. ఇరాన్‌ ఉగ్రవాద దేశంగా మారిందన్నారు. ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ..‘ఇరానే ఈ దాడులు చేసింది. వాళ్లు(ఇరాన్‌) నిజంగా చాలాపెద్ద తప్పు చేశారు. దీన్ని మేం అంత సులభంగా వదిలిపెట్టబోం. ఇరాన్‌కు అర్థమయ్యే భాషలో గట్టిగా జవాబిస్తాం. అణు ఒప్పందం విషయంలో వారిని చర్చలకు ఒప్పిస్తాం’ అని తెలిపారు. ప్రపంచ చమురు రవాణాలో మూడోవంతు సాగే హోర్ముజ్‌ జలసంధిని ఇరాన్‌ మూసివేయలేదన్నారు.   

మరిన్ని వార్తలు