‘ది’న్ని కొంటారా?

26 May, 2014 09:08 IST|Sakshi
‘ది’న్ని కొంటారా?

మెల్‌బోర్న్: బుర్రున్నోడు ఎక్కడైనా బిజినెస్ చేస్తాడు అనడానికి ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఔత్సాహికుడు ఉదాహరణగా నిలుస్తున్నాడు.  ఇంగ్లిష్ పదం ‘ది’ని ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టి త్వరలో అక్షరాలా లక్షలు సంపాదించబోతున్నాడు. మీరు నమ్మకపోతే ... ఆన్‌లైన్ షాపింగ్‌సైట్ ‘ఈబే’కి వెళ్లి చూడండి.. ఏ-4సైజ్ పేపర్‌పై పెన్నుతో రాసిన ‘ది’అనే ఇంగ్లిష్ అక్షరం అక్కడ అమ్మకానికి కనిపిస్తుంది. ఇప్పటికే 43 మంది ఈ ‘ది’ ను కొనడానికి వేలంపాట కూడా మొదలెట్టారు.

ఇప్పుడు దీని విలువ ఎంత పలుకుతుందో తెలుసా...? రూ.55,400. దీనిపై ‘ది’ అమ్మకందారుడు స్పందిస్తూ...‘ఇంగ్లిష్‌లో వేలాది వాక్యాలన్నీ ‘ది’న్ని ఉపయోగించే రాయాలి. ఇది బహుముఖంగా వాడే పదం. అంతేకాదు, దీన్ని కొంటే మీకో వెసులు బాటు కూడా ఉంది. మీ అరచేతిలో, పర్సులో కూడా నేను అమ్మకానికి పెట్టిన వస్తువును భద్రంగా దాచుకోవచ్చు అంటూ సలహా కూడా ఇస్తున్నాడు. కావాలంటే ఈ ‘ది’న్ని వేలంపాటలో మీరు కొనుక్కోవచ్చు.
 

మరిన్ని వార్తలు