పనిచేయని జోరీగ మంత్రం

26 May, 2014 02:41 IST|Sakshi

మహబూబ్‌నగర్ అర్బన్, న్యూస్‌లైన్: చేతులు కాలాక.. ఆకులు పట్టుకు న్న చందంగా..ఓటమిపై కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టుమార్టం ప్రారంభించారు. తె లంగాణ రాష్ట్రాన్ని తామే ఇచ్చామని, అ ధికారం తమకే లభిస్తుందన్న అత్యాశ ఆ పార్టీ శ్రేణుల నమ్మకాన్ని వమ్ము చేసింది. పార్టీ ఓటమికి కారణం నరేంద్రమోడీ ప్రభావమని చెప్పుకుంటున్న నేతలు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన ఘోర పరాజయానికి సాకులు వెతుకుతున్నారు. సోనియమ్మ చెవిలో జోరీగలాగ తెలంగాణ ఏర్పాటు అంశాన్ని జొప్పించానని, ఆమెకు కృతజ్ఞతగా కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలను గెలిపించాలని కేంద్ర మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి జపించిన మంత్రం ఫలించలేదు. పార్టీ గ్రూపు తగాదాలే పరాజయానికి ముఖ్య కారణాలన్న వాస్తవాలు తేలినప్పటికీ, తప్పంతా అధిష్టానానిదే అన్న ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి 10 రోజులు దాటిన తరువాత ఓటమిపై మేధోమదనం నిర్వహించేందుకు పూనుకున్నారు. అందులో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి ఆదివారం జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయం కేకే రెడ్డి నిలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు.
 
  మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి తాను ఓడిపోవడానికి కారణాలను అన్వేషించారు. మహబూబ్‌నగర్ ఎంపీ స్థానం పరిధిలోని ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక తన నిర్ణయానికి వ్యతిరేకంగా జరిగిందని, జిల్లా కేంద్రంలో మైనార్టీయేతరుడిని, నారాయణపేటలో మాజీ ఎంపీ విఠల్‌రావును, కొడంగల్‌లో మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డిని పోటీలో ఉంచినట్లయితే వారితో పాటు తన గెలుపు సులభమయ్యూదని జైపాల్‌రెడ్డి విశ్లేషించారు. దీనికితోడు పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జీలుగా వ్యవహరించిన దిగ్విజయ్‌సింగ్ తదితర నేతల దుందుడుకు స్వభావాల కారణంగా కూడా తెలంగాణలో పార్టీకి తీవ్రనష్టం కలిగించిందని, కేసీఆర్‌తో చర్చించి, టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలని తాను అధిష్టానానికి చేసిన సూచనను పెడచెవిన పెట్టడం కూడా పార్టీ పరాజయానికి మరో కారణమని అభిప్రాయపడ్డారు.
 
 జరిగిపోయిన దానికి  చింతించకుండా మున్ముందు నష్ట నివారణకు కలిసి పని చేద్దామని పార్టీ శ్రేణులకు సూచించారు. సమావేశంలో మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, ఓడిన ఎమ్మెల్యే అభ్యర్థులు డాక్టర్ మల్లు రవి, ఒబేదుల్లా కొత్వాల్, సరాఫ్ కృష్ణ, డోకూరు పవన్‌కుమార్‌రెడ్డి, మాజీమంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎంపీ, ఎమ్మెల్యేలు రుమాండ్ల రాంచంద్రయ్య, రావుల రవీంద్రనాథ్ రెడ్డి , నాయకులు భగవంతురావు, అన్వర్‌పాషా,కెఎస్ రవికుమార్,  ప్రదీఫ్‌కుమార్ గౌడ్, సలీం తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు