చదివినా...తెలియదు

11 Mar, 2018 10:16 IST|Sakshi

న్యూ ఢిల్లీ : ఉదయం లేవగానే మనలో చాలామంది చేసే పని వాట్సాప్‌లో స్నేహితులకు గుడ్‌మార్నింగ్‌ అంటూ సందేశాలు పంపడం. సందేశాలు పంపి ఊరుకుంటామా...లేదు అవతలివారు మన సందేశం చూశారా, లేదా అని గమనిస్తాం. చూసి కూడా బదులు ఇవ్వకపోతే బాధపడతాం, తిట్టుకుంటాం, మరీ కోపమోస్తే బ్లాక్‌ చేస్తాం. ఇదంతా జరగడానికి కారణం వాట్సాప్‌లో ఉన్న రీడ్‌ రెసిప్ట్‌ ఫిచర్‌. దీనివల్ల అవతలి వారు మన మెసేజ్‌ చదివారో, లేదో మనకు తెలుస్తుంది.

మనం వాట్సాప్‌లో మెసేజ్‌ పంపినప్పుడు ఒకటే యాష్‌ కలర్‌ టిక్‌ మార్కు వస్తుంది. మనం పంపిన మెసేజ్‌ అవతలి వారి మొబైలకు చేరగానే రెండు యాష్‌ కలర్‌ టిక్‌ మార్కులు వస్తాయి. మెసేజ్‌ చదవగానే రెండు నీలంరంగు టిక్‌ మార్కులు వస్తాయి. దీని వల్లనే అవతలి వారికి మనం మెసేజ్‌ చదివామో, లేదో తెలుస్తుంది.

కానీ ఇప్పుడు వాట్సాప్‌లో వచ్చిన ఓ కొత్త ఫీచర్‌తో మనం మెసేజ్‌ చదివినా అవతలి వారికి తెలియదు. ఎంటా ఫీచర్‌, ఎలా సెట్‌ చేసుకోవాలని అనుకుంటున్నారా...అది చాలా సులభం. దానికోసం మీ మొబైల్‌లో సెట్టింగ్స్‌ ఏం మార్చక్కరలేదు. చాలా సులభంగా దీనిని సెట్‌ చేసుకోవచ్చు. అందుకు ముందుగా మీరు

1. మీకు వాట్సాప్‌లో మెసేజ్‌ రాగానే, ముందుగా నోటిఫికేషన్‌ పానెల్‌ను కిందికి స్ర్కోల్‌ చేసి, ఏరోప్లేన్‌ మోడ్‌ ఆన్‌ చేయండి.
2. ఇప్పుడు మీరు ఆఫ్‌లైన్‌లో ఉన్నారు. వాట్సాప్‌ ఓపెన్‌ చేసి మెసేజ్‌లు చదవండి.
3. చదవడం అయిపోయాక వాట్సాప్‌ విండోను క్లోస్‌ చేయండి.
4. వాట్సాప్‌ను పూర్తిగా క్లోస్‌ చేసిన తర్వాత ఏరోప్లేన్‌ మోడ్‌ను ఆఫ్‌ చేయండి.


చాలా సులభంగా ఉంది కదా... ఏరోప్లేన్‌ మోడ్‌ ఆన్‌లో ఉంటేనే ఇలా చేయడం కుదురుతుంది. ఇంకో విషయం ఏంటంటే వాట్సాప్‌ విండోను క్లోస్‌ చేయకుండా కేవలం బాక్‌ బటన్‌ను మాత్రమే ప్రెస్‌ చేస్తే మళ్లీ మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్లగానే మీరు మెసేజ్‌ చదివినట్లు చూపించే బ్లూ టిక్‌ మార్క్స్‌ కనిపిస్తాయి. అందుకే వాట్సాప్‌ విండోను పూర్తిగా క్లోస్‌ చేయడం మరవకండి.

మరిన్ని వార్తలు