చిన్న దీవి నుంచి ప్రపంచంలో అతిపెద్ద పదవికి..

14 Jun, 2016 11:45 IST|Sakshi
చిన్న దీవి నుంచి ప్రపంచంలో అతిపెద్ద పదవికి..

న్యూయార్క్: ఐక్యరాజ్యసమితికి కొత్త అధ్యక్షుడు వస్తున్నాడు. దాదాపు 193 దేశాల సభ్యత్వం గల ఈ అంతర్జాతీయ సంస్థకు అతి చిన్న ద్వీపం అయిన ఫిజీకి చెందిన వ్యక్తి ఈ అత్యున్నత బాధ్యతలు స్వీకరించనున్నారు. బాన్ కీ మూన్ స్థానంలో ఆయన కొనసాగనున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభకు సోమవారం ఎన్నికలు జరగగా ఫిజీకి చెందిన పీటర్ థామ్సన్ విజయం సాధించారు. ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతూ 94 ఓట్లు పోలయ్యాయి. ఆయనతోపాటు ఈ పదవికి పోటీపడిన సిప్రస్ కు చెందిన ఆండ్రియాస్ మావ్రోయిన్నిస్ 90 ఓట్లు వచ్చాయి.

దీంతో థామ్సన్ విజయం ఖరారైంది. ఈసారి ఫసిపిక్ దేశాలకు చెందిన వ్యక్తులకు ఈ పదవిని దక్కించుకునే అవకాశం రావడంతో ఫిజీ రాయభారి థామ్సన్ను ఈ అదృష్టం వరించింది. గతంలో ఒక అభ్యర్థిని ప్రతిపాదించగా దానికి ఏకాభిప్రాయం తెలిపేవారు. అయితే, ఈసారి అలా కుదరకపోవడంతో 193 దేశాల సభ్యత్వం ఉన్న ఈ సంస్థలో ప్రధాన అంగమైన జనరల్ అసెంబ్లీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. అమెరికాలో చోటుచేసుకుంటున్న అవినీతి అంశాలపైనే థామ్సన్ తన దృష్టిని పెట్టనున్నారట. భద్రతా మండలిలో భారత్ సభ్యత్వానికి థామ్సన్ అత్యంత అనూకూలమైన వ్యక్తి. అంతేకాకుండా భద్రతామండలి పునర్నియామకం జరగాలని చెప్పే వ్యక్తుల్లో ఈయన కూడా ఒకరు. సెప్టెంబర్ నుంచి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు