జెయింట్ పాండాకు కవలపిల్లలు పుట్టాయ్!

27 Jun, 2016 20:25 IST|Sakshi
జెయింట్ పాండాకు కవలపిల్లలు పుట్టాయ్!

మకావుః చైనాలోని మకావులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలిసారిగా ఓ పాండా కవలపిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. మకావు కు చెందిన జిన్ జిన్ అనే పాండాకు దాని  పెవిలియన్ లో రెండు మగ పాండా పిల్లలు పుట్టాయి. దీంతో మకావు ప్రాంతంలో పిల్లలు పెట్టిన మొదటి పాండాగా జిన్ జిన్ ను అధికారులు గుర్తించారు. పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరోటి కాస్త అనారోగ్యంతోనూ, బరువు తక్కువగా ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.

పాండాల జాతి అంతరించిపోతున్న తరుణంలో మకావులోని జెయింట్ పాండా జిన్ జిన్ కు కవల పిల్లలు పుట్టడం అక్కడివారికి అపురూపంగా మారింది. అందుకే వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జ్యూ లో నివసించే పాండాల్లో గర్భధారణ సహజంగా జరగకపోవడంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడ చేపట్టి పాండాల సంతతి పెంచేందుకు అధికారులు చర్యలు కృషి చేస్తున్నారు.  సాధారణంగా కవల పిల్లలు ఒకరు ఆరోగ్యంగా ఉంటే, మరొకరు కాస్త బలహీనంగా ఉండటం చూస్తుంటాం. అలాగే  ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరొకటి కాస్త బలహీనంగా ఉండి, బరువు తక్కువగా ఉండటంతో దాని ఆరోగ్య రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.  జిన్ జిన్.. కై కై.. జంటను  గత ఏడాది చైనా  మెయిన్ ల్యాండ్..  మకావుకు బహుమతిగా ఇచ్చింది. అదే జంటకు ప్రస్తుతం కవల పిల్లలు పుట్టడంతో మకావు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన పిల్లల్లో ఒకటి 138 గ్రాముల బరువు ఉండగా, మరోటి మాత్రం కేవలం 53.8 గ్రాములే ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిన్ జిన్ ప్రసవం కోసం మకావు అధికారులు జూన్ 14 నుంచే పెవిలియన్ ను కూడ మూసి ఉంచారు.

మరిన్ని వార్తలు