కస్టమర్ కంగుతిన్న వేళ..!

24 Apr, 2016 13:09 IST|Sakshi
కస్టమర్ కంగుతిన్న వేళ..!

ఫ్రాన్స్: పాపం అతనెంతో ఆకలితో ఉన్నాడు. తృప్తిగా భోంచేద్దామని.. అది కూడా వీకెండ్ కావడంతో ఎంచక్కా చికెన్ వింగ్స్కు ఆర్డర్ ఇచ్చాడు. ఆ పార్సిల్ తీసుకొని టేబుల్ వద్ద కూర్చొని ఎదురు ఓ బీరుగ్లాసు.. కొంచెం కారలాంటి పదార్థాలు పెట్టుకున్నాడు. ఆ వెంటనే తాను ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న కోడి రెక్కల ఫ్రైని ఓపెన్ చేశాడు. అలా ఓపెన్ చేశాడో లేదో అతడు అవాక్కయ్యాడు. ఎందుకంటే అందులో కోడి రెక్కలకు బదులు కోడి తలకాయ వచ్చింది.

అది కూడా కనీసం దాని ఈకలు, జుట్టుకూడా తొలగించకుండా అలా వేపుడు చేసి జుగుప్సకరంగా కనిపించేట్లుగా ఉన్న తలకాయ.. దాంతో ఆకలి సంగతేమోగానీ ఆ రెస్టారెంట్ చేసిన పనికి అతడు కోపంతో ఊగిపోయాడు. తనలాగ ఇంకెవరూ మోసపోవద్దనుకున్నాడేమో దానిని చేతిలో పట్టుకొని వీడియో తీసి ఆన్ లైన్ లో పెట్టాడు. దీంతో ఈ వీడియో పెట్టిన సెకన్లోనే వేలమంది చూశారు. ఇప్పుడది హల్ చేయడమే కాకుండా ఆ రెస్టారెంటు నిర్వాహకులపై ఆగ్రహం వెలిబుచ్చేలా చేస్తోంది. ఈ ఘటన ఫ్రాన్స్లో చోటుచేసుకోగా క్విక్ అనే రెస్టారెంటు ఈ సంఘటనకు బాధ్యురాలైంది.

మరిన్ని వార్తలు