కాసినోలో కాల్పులు

3 Jun, 2017 01:03 IST|Sakshi
కాసినోలో కాల్పులు

37 మంది మృతి
► ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఘటన..
► దోపిడీ కోసం కాల్పులు
►  పొగతో ఊపిరాడక  బాధితుల మృతి


మనీలా: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని ఓ  కాసినో.. రంగురంగుల లైట్ల వెలుగుల్లో జనం కేరింతలు. ఒక్కసారిగా రైఫిల్‌ పేలిన శబ్దం.. ప్రజలు బయటికి పరుగులు తీయడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. మరోవైపు టీవీ స్క్రీన్‌ పేలి పొగ దట్టంగా వ్యాపిం చడంతో చాలామంది అక్కడే కుప్పకూలారు. పోలీసులు కాసినోను చుట్టుముట్టి లోనికి ప్రవేశించారు. 5 గంటల తర్వాత.. కాల్పులు జరిపిన దుండగుడి  మృతదేహంతోపాటు 37 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ గురువారం అర్థరాత్రి కాసినోలో జరిగిన హృదయవిదారక ఘటన. రూ. 14 కోట్ల విలువజేసే కాసినో చిప్స్‌(ఆట కోసం వాడే కాయిన్స్‌) కోసమే దుండగుడు ఈ దారుణా నికి పాల్పడ్డాడు.

అర్ధరాత్రి కాసినోలోకి వచ్చినే దుండగుడు  ఆటోమెటిక్‌ రైఫిల్‌తో కాల్పులు ప్రారంభించాడు. జనాన్ని టార్గెట్‌ చేయకుండా  టీవీ ్రïస్కీన్‌కు గురిపెట్టి కాల్చా డు. టీవీ పేలి మంటలు వ్యాపించాయి. కాసి నో అంతా దట్టమైన పొగతో నిండిపో యిం ది. ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. చాలామంది లోపలే చిక్కుకుపోయారు. ఇంగ్లిష్‌లో మాట్లాడిన ముష్కరుడు  యూరో పియన్‌లా ఉన్నాడని, కాల్పుత తర్వాత అతడు   పెట్రోల్‌ పోసుకుని నిప్పంటిచుకుని ఉంటాడని  భావిస్తున్నారు. మృతుల్లో ఎవ రూ కాల్పుల్లో చనిపోలేదని, పొగలు వ్యాపిం చడంతో ఊపిరాడక మృతిచెందినట్లు పోలీ సులు తెలిపారు. ఇది ఉగ్రవాద దాడి కాద న్నారు.  ఇదిలా ఉండగా ఈదాడికి పాల్ప డింది తామేనని ఐఎస్‌ ప్రకటించింది.

మరిన్ని వార్తలు