కోళ్లను వధించడానికి సైనికులు!

24 Mar, 2017 13:00 IST|Sakshi
కోళ్లను వధించడానికి సైనికులు!

టోక్యో: జపాన్‌ కోళ్ల పరిశ్రమను బర్డ్‌ ఫ్లూ అతలాకుతలం చేస్తోంది. వ్యాధి సోకిన కోళ్లను వధించడం కోసం వందలాది సైనికుల సహాయాన్ని ఆ దేశం తీసుకుంటుందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

మొదటగా గత నవంబర్‌లో అమోరీ ప్రాంతంలో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ను గుర్తించిన అనంతరం భారీ సంఖ్యలో కోళ్లను జపాన్‌ వధించింది. తాజాగా దేశ ఈశాన్య ప్రాంతంలోని మియాగిలో 2,20,000 కోళ్లను, టోక్యో సమీపంలో 68,000 కోళ్లను వధించేందకు సైనికుల సహాయం తీసుకుంటున్నట్లు ఫామ్‌ మినిస్ట్రీ అధికారి ఒకరు శుక్రవారం వెల్లడించారు. దీంతో నవంబర్‌ నుంచి ఇప్పటివరకు ఆ దేశం వధించిన కోళ్ల సంఖ్య 167 లక్షలకు చేరుకోనుంది. 370 మంది సైనిక బృందాన్ని కోళ్లను వధించడానికి పంపినట్లు జపాన్‌ డిఫెన్స్‌ మినిస్ట్రీ ధృవీకరించింది.

మరిన్ని వార్తలు