విశ్వకవి జీవితంతో స్ఫూర్తి పొందిన జపాన్‌ కళాకారుడు..!

28 Nov, 2023 17:24 IST|Sakshi

విశ్వకవి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ గురించి ఎంత చెప్పిన తక్కువ. ఆయన ఎందరికో స్ఫూర్తి. ఆయన సాహిత్య రచనలు, సిద్ధాంతాలు ఎందరినో కదిలించాయి. కానీ ఓ జపాన్‌ కళాకారిణి మన రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ ఆలోచనలకు ఫిదా అయ్యానని చెబుతోంది. పైగా ఆ కవి తన స్ఫూర్తి అని చెబుతోంది. ఓ విదేశీయురాలు మన విశ్వకవిని ఆరాధిస్తున్నాడంటే..ప్రతి భారతీయుడు ఎంతో గర్వంగా ఫీలై సంఘటన. ఇంతకీ అతను ఎవరంటే..

కోల్‌కతాలోని జపాన్ కాన్సులేట్ ఒక సిటీ క్లబ్‌లో సంగీత వేడుకను నిర్వహించింది. ఆ కార్యక్రమంలో ఓ జపాన్ కళాకారిణి విశ్వకవి గురించి ఎంతగొప్పగానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. బెంగాల్‌ కవి రవీంద్ర నాథ్‌ ఠాగూర్‌ ఆలోచన, సిద్ధాంతాలు తనను కదిలించాయని చెబుతోంది జపనీస్‌ కళాకారుడు పియానిస్ట్‌ యుకికో కుసునోకి. ఆయన ప్రేరణతోనే ఈ కార్యక్రమంలో ఎన్నో మధుర గీతాలను, ఇతర జపనీస్‌ ట్యూన్లను ప్లే చేశానని చెప్పింది.

తన ఆదర్శాలు, ఆలోచనలు ఠాగూర్‌ తో మమేకమయ్యాయనని ఆనందంగా చెబుతోంది. ఇటీవలే ఠాగూర్‌ నివాసమైన శాంతినికేతన్‌ని సందర్శించినట్లు వివరించింది. అక్కడ ప్రజలను కలుసుకుని సంగీత ప్రదర్శన ఇవ్వడం తనకెంతో సంతోషం అనిపించిందని చెబుతుంది. తనకెప్పటీ నుంచో శాంతినికేతన్‌ని చూడాలన్నేదే చిరాల కోరిక అని అది ఇప్పటికీ నెరవేరిందని సంతోషంగా చెప్పింది. నిజానికి సంగీతం అనేది హద్దులు లేనిది. దీంతో మానవజాతి మధ్య శాంతి సామరస్యలను, ప్రేమ వంటి వాటిని పెంపొందించొచ్చు. అంతేగాదు తాను 2022లో భారత్‌ సందర్శనానికి వచ్చినప్పుడే ఠాగూర్‌కి సంబంధించిన మెలోడి సంగీతాన్ని కనుగొన్నానని దానిని తాను ఎంతో కష్టబడి యూట్యూబ్‌ సాయంతో నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. 

(చదవండి: 56 ఏళ్ల వయసులో ఎమ్మెస్సీ పాసైన సెక్యూరిటీ గార్డు!ఏకంగా 23 సార్లు..)

>
మరిన్ని వార్తలు