ద్వీపం పుట్టడం చూశారా? కెమెరాకు చిక్కిన అరుదైన దృశ్యం!

19 Nov, 2023 10:25 IST|Sakshi

ద్వీపాలు ఎలా పుడతాయనే దానిపై జాగ్రఫీ పాఠాల్లో కొంత సమాచారం ఉంటుంది. కొన్ని ద్వీపాలు అగ్నిపర్వతాల పేలుళ్ల వల్ల ఏర్పడతాయి. కొత్తగా ఒక ద్వీపం ఏర్పడుతున్న దృశ్యాన్ని ఇంతవరకు ఎవరూ కళ్లారా చూసిన దాఖలాలు లేవు. అయితే, జపాన్‌లో మాత్రం అగ్నిపర్వతం పేలుడు ఫలితంగా ఒక కొత్త ద్వీపం ఏర్పడుతున్న అరుదైన దృశ్యం కెమెరాలకు చిక్కింది. టోక్యో నగర దక్షిణ తీరానికి ఆవల సముద్రంలో ఉన్న ఇవోటో అగ్నిపర్వతం లావాను ఎగజిమ్మడం ప్రారంభించింది.

దీని నుంచి ఇప్పటికీ తరచుగా లావా ఎగసిపడుతూనే ఉంది. ఇప్పటి వరకు దీని నుంచి వెలువడిన లావా సముద్రజలాల్లో గడ్డకడుతూ క్రమంగా ఒక దీవిలా ఏర్పడుతూ వస్తోంది. ఇప్పటి వరకు లావా గడ్డకట్టినంత మేర ఒక చిన్నదీవిలా ఏర్పడింది. జపాన్‌ సముద్ర జలాల్లో 1986 తర్వాత ఒక కొత్త దీవి ఏర్పడటం ఇదే తొలిసారి. అయితే, ఇదివరకు ఇలాంటి దీవులు పుడుతున్న దృశ్యాలను చూసిన వాళ్లెవరూ లేరు.  

(చదవండి: సినిమాలు చూస్తే..కేలరీలు బర్న్‌ అవుతాయట! పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు)

మరిన్ని వార్తలు