నేను సూపర్‌ విలన్‌ భార్యను

16 May, 2018 15:28 IST|Sakshi
అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌లోని విలన్‌ థానోస్

మనీలా : పాపులారిటీ ఉన్న వాళ్ల పేర్లను వాడుకుని ప్రచారం పొందడం ఈ మధ్య సర్వసాధారణమైపోయింది. ఆఖరికి కామిక్‌ విలన్‌ను కూడా వదలటం లేదు కొందమంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విజయపథంలో దూసుకుపోతున్న అవెంజర్స్‌ ఇన్ఫినిటీ వార్‌లోని విలన్‌ థానోస్ తన భర్తంటూ ఫిలిప్పీన్స్‌ సెనేటర్‌ ట్విటర్‌లో పోస్టులు పెట్టారు. వివరాలలోకి వెళితే.. మే 5న ఫిలిప్పీన్స్‌ సెనేటర్‌ నాన్సీ బినయ్‌ ఇన్ఫినిటీ వార్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించిన మాయోయావోలో ఫోటోలు దిగి ట్విటర్‌లో ఉంచారు.

కొద్ది రోజుల తర్వాత ఓ పార్టీలో పాల్గొన్న ఆమె తలపై వైకింగ్స్‌ కిరీటాన్ని ధరించి థానోస్ భార్యను తానే అని ప్రకటించుకున్నారు. మరి ఆమె అవెంజర్స్‌ సినిమా చూసి ఇలా మాట్లాడారా? లేదా ఫిలిప్పీన్స్‌ పర్యాటక రంగాన్ని పాపులర్‌ చేయడానికి ఇలా మాట్లాడుతున్నారో అని తెలియక తలలు పట్టుకుంటున్నారు అక్కడి వారు. కామిక్‌ విలన్‌ మనిషిని ఏట్లా పెళ్లి చేసుకుంటాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. 

మరిన్ని వార్తలు