జాదవ్‌ కేసులో త్వరలో తుదితీర్పు

4 Jul, 2019 19:43 IST|Sakshi

హేగ్‌ : కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసులో హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్ధానం ఆగస్టులో తుది తీర్పు వెలువరించనుంది. జాదవ్‌ కేసులోఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి 21 వరకూ సాగిన తుది విచారణలో భారత్‌, పాకిస్తాన్‌లు తమ వాదనలను న్యాయస్ధానానికి నివేదించాయి. భారత్‌కు చెందిన జాదవ్‌ను గూఢచర్య ఆరోపణలపై పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ ఇరాన్‌ నుంచి అపహరించిన సంగతి తెలిసిందే.

పాకిస్తాన్‌ సైనిక కోర్టు గూఢచర్య ఆరోపణలపై జాదవ్‌కు మరణ శిక్ష విధించింది. పాకిస్తాన్‌ కుట్రపూరితంగా వ్యవహరించి జాదవ్‌పై గూఢచర్య అభియోగాలు మోపిందని భారత్‌ ఆరోపిస్తోంది. పాక్‌ కోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ భారత్‌ అంతర్జాతీయ న్యాయస్ధానాన్ని ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు