పత్రికా స్వేచ్ఛలో భారత్‌ ర్యాంక్‌ 138

26 Apr, 2018 03:50 IST|Sakshi

లండన్‌: పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్‌ ర్యాంకు మరింతగా పడిపోయింది. గత ఏడాది ర్యాంక్‌ 136 కాగా, ఈ ఏడాది 138కు దిగజారిందని రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌(ఆర్‌ఎస్‌ఎఫ్‌) అనే అంతర్జాతీయ సంస్థ తెలిపింది. ప్రధాని మోదీ వైఖరే ఇందుకు కారణమని విమర్శించింది. సంపూర్ణ పత్రికా స్వేచ్ఛ ఉన్న దేశంగా నార్వే రెండో ఏడాది కూడా ప్రథమ స్థానంలో నిలవగా, ఉత్తరకొరియా అట్టడుగున ఉన్నట్లు తెలిపింది.

వివిధ అంశాల ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా 180 దేశాల్లో ఉన్న పత్రికా స్వేచ్ఛకు ఆర్‌ఎస్‌ఎఫ్‌ సంస్థ ఏటా ర్యాంకులు ఇస్తుంది. ఈ ఏడాది నివేదికలో.. మోదీ అధికారంలోకి వచ్చాక భారత్‌లో హిందూ ఛాందసవాదుల విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలు పెరిగిపోయాయంది. హిందూ మత ఆధిక్యత, కుల వ్యవస్థ, మహిళా హక్కులపై ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాతోపాటు జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు ఎక్కువయ్యాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు