పాక్‌ హైకమిషనర్‌కు భారత్‌ సమన్లు..!

15 Feb, 2019 15:39 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఉగ్రవాద ప్రేరేపిత సంస్థలపై చర్యలను తీసుకోవల్సిందిగా పాకిస్తాన్‌ హైకమిషనర్‌కు భారత్‌ సమన్లు జారీ చేసింది. భారత జవాన్లపై ఆత్మహుతి దాడికి పాల్పడిన పాకిస్తాన్‌కు చెందిన జేషే ఏ మహ్మద్‌ ఉగ్రసంస్థపై చర్యలు తీసుకుకోని, వాటిని వెంటనే నిషేధించాలని భారత్‌ అదేశించింది. ఈమేరకు భారత విదేశాంగ కార్యదర్శి విజయ్‌ గోఖలే శుక్రవారం పాకిస్తాన్‌ హైకమిషనర్‌కు సమన్లు జారీచేశారు.

పుల్వామాలో జరిగిన దాడికి కారకులైన వారిని వెంటనే శిక్షించాలని, ఉగ్రవాద మూలాలున్న గ్రూపులను, వ్యక్తులను నిలువరించాలని పాక్‌ను భారత్‌ ఆదేశించింది. భారత్‌ సైనికులపై దాడికి పాల్పడ్డ సంస్థలను నిషేధించకుంటే చర్యలు తప్పవని భారత్‌ హెచ్చరించింది. పుల్వామా దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు