అమర జవాన్లకు హోంమంత్రి రాజ్‌నాథ్‌ నివాళి

15 Feb, 2019 15:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్‌ జవాన్లకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జమ్మూ కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, ఆర్మీ నార్తర్న్‌ కమాండ్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణబీర్‌ సింగ్‌లు శుక్రవారం బుద్గాంలో నివాళులు అర్పించారు. ఉగ్రదాడిలో నేలకొరిగిన అమర .జవాన్ల భౌతిక కాయాలను అమర్చిన పేటికలను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌లు తమ భుజాలకెత్తుకున్నారు.

ఉగ్రదాడిలో మరణించిన జవాన్ల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, ఉగ్ర దాడిలో జవాన్లను మట్టుబెట్టిన వారిపై తీవ్ర చర్యలు తప్పవని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ సమావేశంలో దాడి నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితిని సమీక్షించారు. పుల్వామాలో శుక్రవారం సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 44 మంది జవాన్లు మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు