సైన్స్‌ ఆర్టికల్స్‌ ప్రచురణలో భారత్‌కు మూడో స్థానం

19 Dec, 2019 09:13 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా సైన్స్, ఇంజనీరింగ్‌ రంగాలకు సంబంధించి అత్యధిక ఆర్టికల్స్‌ ప్రచురించిన దేశాల జాబితాలో భారత్‌ మూడో స్థానంలో నిలిచిందని అమెరికాకు చెందిన నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ (ఎన్‌ఎస్‌ఎఫ్‌) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 2008లో సైన్స్, ఇంజనీరింగ్‌ రంగాలకు సంబంధించి మొత్తం 17.5 లక్షల ఆర్టికల్స్‌ ప్రచురితమవ్వగా.. 2018 నాటికి ఆ సంఖ్య 25.5 లక్షలకు పెరిగిందని తెలిపింది.

ఎన్‌ఎస్‌ఎఫ్‌ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం... అత్యధిక ఆర్టికల్స్‌ ప్రచురించిన దేశాలుగా చైనా, అమెరికా, భారత్‌ వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌లో 2008లో 48,998 ఆర్టికల్స్‌ ప్రచురితమవ్వగా.. 10.73 శాతం వార్షిక వృద్ధి రేటుతో ఆ సంఖ్య 2018 నాటికి 1.35 లక్షలకు పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా సైన్స్‌ ఆర్టికల్స్‌లో చైనా 20.67 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. వార్షిక వృద్ధి రేటు 7.81 శాతంగా నమోదైంది. సైన్స్‌ ఆర్టికల్స్‌లో అమెరికా ఏడాదికి 0.71 శాతం వృద్ధి సాధించింది.

సైన్స్‌ ఆర్టికల్స్‌లో టాప్‌-10 దేశాలు
1. చైనా (5,28,263)
2. అమెరికా (4,22,808)
3. భారత్‌ (1,35,788)
4. జర్మనీ (1,04,396)
5. జపాన్‌ (98,793)
6. యూకే (97,681)
7. రష్యా (81,579)
8. ఇటలీ (71,240)
9. దక్షిణ కొరియా (66,376)
10. ఫ్రాన్స్‌ (66,352)

మరిన్ని వార్తలు