'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'

10 Nov, 2015 08:41 IST|Sakshi
'భారతీయ కంపెనీలకు భారీ ఫైన్'

వాషింగ్టన్: భారతీయ సంతతికి వ్యక్తులకు చెందిన రెండు కంపెనీలకు అమెరికా కోర్టు భారీ మొత్తంలో ఫైన్ వేసింది. దాదాపు రూ.68,41,458.17(103000 డాలర్లు) మొత్తం ప్రభుత్వానికి చెల్లించాలని, మరో రూ.5579441.62(84,000డాలర్లు) ఉద్యోగులకు చెల్లించాలని ఆదేశించింది. ఇంతమొత్తంలో ఆ కంపెనీలకు ఎందుకు ఫైన్ వేశారని అనుకుంటున్నారా.. అందుకు ప్రధాన కారణం ఆ కంపెనీలు హెచ్-1బీ వీసాల విషయంలో ఉల్లంఘనలకు పాల్పడటమే.

సిలికాన్ వ్యాలీలో గల ప్రముఖ కంపెనీలైన స్కోపస్ కన్సల్టింగ్ గ్రూప్, ఆరియాన్ ఇంజినీర్స్ అనేవి భారతీయ సంతతికి చెందిన వ్యక్తులైన కిషోర్ కుమార్ మరో వ్యక్తికి సంబంధిన కంపెనీలు. ఈ కంపెనీ భారత్తోపాటు ఇతర దేశాల నుంచి కూడా తమ కంపెనీకి హెచ్-1బీ వీసాల ద్వారా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లను ఈబే, ఆపిల్, సిస్కో సిస్టమ్ కంపెనీల మాదిరిగా రప్పించింది. అయితే, ఈ క్రమంలో ఆ కంపెనీలు వీసా ఉల్లంఘనలకు పాల్పడ్డాయని అమెరికాకు చెందిన లేబర్ వేజ్ డిపార్ట్ మెంట్ గుర్తించింది. వీసాల్లో పేర్కొన్న విధంగా సదరు ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటికి భారీ ఫైన్ వేసింది.

మరిన్ని వార్తలు