కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారతీయుడి భారీ విరాళం

30 Jun, 2016 22:14 IST|Sakshi
కాలిఫోర్నియా యూనివర్సిటీకి భారతీయుడి భారీ విరాళం

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన భౌతికశాస్త్రవేత్త మణి భూమిక్.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి 11 మిలియన్ డాలర్లను(సుమారు రూ. 74 కోట్లు) విరాళంగా ఇచ్చారు. ప్రకృతి సూత్రాల పరిశోధన కోసం కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రత్యేకంగా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. దీనికోసం భూమిక్ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదే అతిపెద్ద విరాళమని ఛాన్సలర్ గినే బ్లాక్ తెలిపారు. ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన పరిశోధన కేంద్రం ‘భూమిక్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ థిరీటికల్ ఫిజిక్స్’ను మణి భూమిక్ నిర్వహిస్తున్నారు.

కంటికి వాడే లేజర్ చికిత్స అభివృద్ధి చేయడంలో భూమిక్‌ది కీలక పాత్ర. పశ్చిమబెంగాల్‌లోని ఓమారుమూల గ్రామంలో ఆయనకు ఆరుగురు తోబుట్టువులు ఉన్నారు. చిన్నప్పుడు పూరి గుడిసెలో పెరిగిన భూమిక్ నాలుగు మైళ్లు నడిచి స్కూల్‌కు వెళ్లేవాడు. 1958లో కోల్‌కతా యూనివర్సిటీలో పీజీ, ఖరగ్‌పూర్ నుంచి ఐఐటీ భౌతికశాస్త్రంలో డాక్టరేట్ అందుకున్నారు. 1959లో 3 డాలర్లతో అమెరికాకు వెళ్లిన భూమిక్ 1961లో జిరాక్స్ ఎలక్ట్రో ఆప్టికల్ సిస్టమ్‌లో లేజర్ సైంటిస్టుగా చేరాడు. 2011లో భారత ప్రభుత్వం మణి భూమిక్‌ను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

మరిన్ని వార్తలు