నాస్తికులు అందరూ తెలివైన వాళ్లా?

18 May, 2017 09:55 IST|Sakshi
నాస్తికులు అందరూ తెలివైన వాళ్లా?

ప్రఖ్యాత శాస్త్రవేత్తలు స్టీఫెన్‌ హాకింగ్‌ దగ్గర నుంచి అలన్‌ ట్యూరింగ్‌ వరకూ.. ఇలా ప్రపంచంలో చాలా మంది తెలివైన వ్యక్తులందరూ నాస్తికులు. వీరందరూ ఎందుకు నాస్తికులు అయ్యారు?. నాస్తికుడు అయిన ప్రతి వ్యక్తి వీరంత గొప్పగా అవుతారా? లేదా తెలివైన ప్రతి ఒక్కరూ నాస్తికులుగా మారతారా? అనే ప్రశ్నలకు ఉల్‌స్టర్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ సోషల్‌ రీసెర్చ్‌, రొట్టర్‌డమ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సమాధానమిచ్చారు.

ఈ విషయాలపై అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. మతాన్ని అభిమానించడం లేదా అభిమానించకపోవడం అనేది వ్యక్తి సహజ లక్షణాలపై ఆధారపడివుంటుందని చెప్పారు. తెలివితేటలతో సహజ లక్షణాలను నిలువరింపజేయగల శక్తి వస్తుందని వివరించారు. దీనిపై పూర్తిస్ధాయిలో పరిశోధన కోసం ఇంటిలిజెన్స్‌-మిస్‌మ్యాచ్‌ అసోసియేషన్‌ అనే మోడల్‌ను అభివృద్ధి చేశారు.

ఈ మోడల్‌ ద్వారా మతపరమైన సంబంధాలపై తెలివితేటలు గల వ్యక్తులు అనాసక్తిని ఎందుకు ప్రదర్శిస్తారనే విషయాన్ని వివరించేందుకు ప్రయత్నించారు. వ్యక్తి లక్షణాలు, ఒత్తిడిపై కూడా పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు తెలివైన వ్యక్తులు తక్కువ ఒత్తిడికి గురవుతారని చెప్పారు. వీరు ఏ పనినైనా ఇట్టే క్షణాల్లో పూర్తి చేయగలరని వివరించారు.

మరిన్ని వార్తలు