ప్రపంచ బాల మేధావి ఈశ్వర్‌ శర్మ

13 Jan, 2020 05:10 IST|Sakshi

లండన్‌: ఆధ్యాత్మిక యోగాలో సాధించిన విజయాలకుగానూ పదేళ్ల స్కూల్‌ విద్యార్థి, బ్రిటిష్‌ ఇండియన్‌ ఈశ్వర్‌ శర్మను ప్రపంచ బాల మేధావి–2020 అవార్డుతో బ్రిటన్‌ సత్కరించింది. 30 విభిన్న (బైకింగ్, కొరియోగ్రఫీ, ఫిట్‌నెస్, మార్షల్‌ ఆర్ట్స్‌ తదితర) రంగాల్లో సత్తాచాటిన ప్రపంచంలోని 45 దేశాలకు చెందిన బాల మేధావులను ఈ అవార్డులకు ఎంపిక చేశారు. అందులో ఇంగ్లండ్‌లోని కెంట్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈశ్వర్‌ శర్మ యోగాలో అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు ఈ అవార్డును సొంతం చేసుకున్నాడు. ‘45 దేశాల నుంచి 15 వేల మంది దరఖాస్తుదారుల్లో ప్రపంచ బాల మేధావి అవార్డుకు ఎంపికైనందుకు గర్వంగా ఉంది. యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. విద్యార్థులకు యోగా చాలా ముఖ్యం.’అని అవార్డు తీసుకుంటున్న సందర్భంగా శర్మ చెప్పాడు.

మరిన్ని వార్తలు