విదేశీ పిల్లలకు ఐసిస్ ఉగ్ర శిక్షణ

31 Jul, 2016 12:20 IST|Sakshi
విదేశీ పిల్లలకు ఐసిస్ ఉగ్ర శిక్షణ

లండన్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) తర్వాతి తరం ఉగ్రవాదులను తయారు చేయటానికి సిరియా, ఇరాక్‌లలో విదేశీ ఉగ్రవాదుల పిల్లలకు శిక్షణనిస్తోందని యూరోపోల్ తాజా నివేదిక వెల్లడించింది. వారు యూరప్‌కు తిరిగి వచ్చి యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలకు దీర్ఘకాలంలో భారీ ముప్పుగా పరిణమించగలరని ఆందోళన వ్యక్తంచేసింది.

బ్రిటన్‌కు చెందిన పిల్లలు 50 మందికి పైగా ఐసిస్ ఆధీనంలోని ప్రాంతంలో నివసిస్తున్నారని.. అలాగే మరో 32,000 మంది గర్భిణులు ఉన్నారని ఆ నివేదికను ఉంటంకిస్తూ ఇండిపెండెంట్ వార్తా పత్రిక కథనం ప్రచురించింది. ఈ పిల్లలకు ఐసిస్ భావజాలాన్ని నూరిపోస్తూ పశ్చిమ దేశాల పట్ల తీవ్ర ద్వేషాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొంది. ఐసిస్‌లో చేరటానికి ఐదు వేల మందికి పైగా యూరోపియన్లు సిరియా, ఇరాక్‌లకు వెళ్లినట్లు యూరోపోల్ అంచనా.

మరిన్ని వార్తలు