'ఇప్పుడే ఏమైంది.. ఇంకా ఘోర విధ్వంసం సృష్టిస్తాం'

23 Nov, 2015 13:36 IST|Sakshi
'ఇప్పుడే ఏమైంది.. ఇంకా ఘోర విధ్వంసం సృష్టిస్తాం'

పారిస్: భవిష్యత్తులో పారిస్లో అత్యంత జుగుప్సకరమైన పరిస్థితులు కనిపించేలా దాడులు నిర్వహిస్తామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆ దాడులు మొన్న జరిగిన దాడికంటే భయంకరంగా ఉంటాయని హెచ్చరించింది. ఇందుకు ఓ ట్రయల్గా 'జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా' అనే చిత్రంలోని ఓ వీడియో క్లిప్ ను ఇస్లామిక్ స్టేట్ విడుదల చేసింది. ఈ వీడియో ప్రకారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఈఫిల్ టవర్ను ఓ క్షిపణి బలంగా ఢీకొట్టడంతోపాటు చిన్న రొబోటిక్ డిస్ట్రాయర్స్ ధ్వంసం చేస్తాయి.

దీంతో ఆ టవర్ అందరు చూస్తుండగా నది మీదుగా కూలిపోతుంటుంది. ఈ వీడియో ద్వారా పారిస్ కు హెచ్చరికలు పంపించినట్లవుతుందని ఈ సందర్భంగా ఇస్లామిక్ స్టేట్ పేర్కొంది. ఈ వీడియోకు 'పారిస్ కుప్పకూలిపోయింది' అని పేరుపెట్టి మరీ విడుదల చేసింది. 2009 'జీఐ జో: ది రైస్ ఆఫ్ కోబ్రా' చిత్రం విడుదలైంది. నిజంగానే ఆ సినిమాలో ఈఫిల్ టవర్ కూలిపోయే సందర్భాన్ని చూస్తే ఒళ్లు ఎంత గగుర్పొడుస్తుందో తాము దాడులకు దిగినప్పుడు అలాంటి భయాందోళనలే కలుగుతాయని ఐఎస్ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు