జెద్దా తెలుగు సంఘం 'తాజ్' నూతన కార్యవర్గం

30 Apr, 2016 14:41 IST|Sakshi
జెద్దా తెలుగు సంఘం 'తాజ్' నూతన కార్యవర్గం

సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) కార్యవర్గానికి నూతన కార్యవర్గం ఎంపికైంది. సంఘం నూతన అధ్యక్షునిగా మహ్మద్ యూసుఫ్ (కరీంనగర్), ప్రధాన కార్యదర్శిగా మెడికొండు భాస్కర్ రావు (గుంటూరు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజ్ అవిర్భావం నుంచి ఈ ఇద్దరు సంస్థ కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించారు.

తమ సంఘంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాంత, కుల, మతాతీలకు అతీతంగా సభ్యులుగా ఉన్నారని,  తాము సౌదీలోని తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సాంస్కృతిక అభివృద్ధికి కృషి చేస్తామని యూసుఫ్, భాస్కర్ పేర్కొన్నారు. తెలుగువారు 00966561361280 లేదా 00966549103071 నెంబర్లలో సంప్రదించవచ్చుని వారు వివరించారు.

మరిన్ని వార్తలు