అమెరికాలో భారీ భూకంపం

25 Aug, 2014 02:19 IST|Sakshi

శాన్ ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఆదివారం రిక్టర్ స్కేల్‌పై 6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. తెల్లవారుజామున  వచ్చిన ఈ భూకంప కేంద్రం అమెరికన్ కాన్యోన్‌లో భూమికి 10.8 కి.మీ దిగువన నమోదైంది. నార్తర్న్ బే ఏరియాలో ప్రభావం తీవ్రంగా ఉంది.

అక్కడ 70 మంది గాయపడ్డారు.  పలు భవనాలు కూలిపోయాయి. కొన్నిచోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో, డేవిస్‌లలో భూకంప ప్రభావం కనిపించింది. మరోపక్క.. ఐస్‌ల్యాండ్‌లోని బర్దార్‌బుంగ అగ్నిపర్వతం కింద రెండు భూకంపాలు వచ్చాయి.
 

మరిన్ని వార్తలు