చైనా యాప్‌ల నిషేధం సరైన చర్య : అమెరికా

1 Jul, 2020 20:53 IST|Sakshi

డ్రాగన్‌కు చెక్‌

వాషింగ్టన్‌ : టిక్‌టాక్‌, షేర్‌ఇట్‌ సహా 59 చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడాన్ని అమెరికా సమర్ధించింది. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని, చైనా యాప్‌లను భారత్‌ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో బుధవారం పేర్కొన్నారు.

మరోవైపు చైనా యాప్‌లను భారత్‌ నిషేధించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా సోషల్‌ మీడియా బ్లాగింగ్‌ సైట్‌ వీబో నుంచి వైదొలిగారు. చైనా యాప్‌లను భారత ప్రభుత్వం నిషేధించడంపై భారత్‌లో చైనా రాయబార కార్యాలయ ప్రతినిధి జి రోంగ్‌ స్పందించారు. ఈ వ్యవహారంపై తమ దేశం తీవ్రంగా కలత చెందుతోందని, ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. చదవండి చైనాపై మరింత కోపంగా ఉన్నాను: ట్రంప్‌ 

మరిన్ని వార్తలు