ఆ తొమ్మిదో గ్రహం ఉండొచ్చు!

17 Oct, 2017 03:20 IST|Sakshi

వాషింగ్టన్‌: ఖగోళ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని గ్రహమైన ‘ప్లానెట్‌ 9’ఉందని, బహుశా భూమి ద్రవ్యరాశి కన్నా 10 రెట్లు, సూర్యుడి నుంచి నెప్ట్యూన్‌ ఉన్న దూరం కన్నా 20 రెట్ల దూరం ఉండొచ్చని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మన సౌర కుటుంబంలో ఆచూకీ తెలియకుండా పోయిన ‘సూపర్‌ ఎర్త్‌’ఈ ప్లానెట్‌ 9 కావొచ్చని భావిస్తున్నారు.

ప్లానెట్‌ 9 భూమి ద్రవ్యరాశి కన్నా ఎక్కువగా ఉన్నా.. యురేనస్, నెప్ట్యూన్‌ కన్నా తక్కువగా ఉందని చెబుతున్నారు. ప్లానెట్‌ 9 ఉందనడానికి 5 రకాల రుజువులు ఉన్నాయని గుర్తించినట్లు అమెరికాలోని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన ఆస్ట్రోఫిజిసిస్ట్‌ కొన్‌స్టాంటిన్‌ బాటీజిన్‌ తెలిపారు. ప్లానెట్‌ 9 మన సౌర కుటుంబం దిశగా దాదాపు 450 కోట్ల సంవత్సరాల కిందట వంగి ఉండొచ్చని కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన విద్యార్థి ఎలిజబెత్‌ బెయిలీ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు