వినబడని ఆడియోలకు లిప్ రీడింగ్ టెక్నాలజీ..

25 Mar, 2016 15:13 IST|Sakshi
వినబడని ఆడియోలకు లిప్ రీడింగ్ టెక్నాలజీ..

లండన్: ఇక వీడియోలో మాటలు వినిపించకపోయినా నష్టం లేదని, లిప్ రీడింగ్ టెక్నాలజీతో తెలుసుకోవచ్చని అంటున్నారు ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం అధ్యయనకారులు. వినికిడి లోపం ఉన్నవారికి విషయాలను కమ్యూనికేట్  చేయడంతోపాటు , నేర పరిశోధనకు ఈ కొత్త టెక్నాలజీ మరింత ప్రయోజనకరంగా ఉండేట్టుగా అభివృద్ధి చేసినట్లు చెప్తున్నారు.

ధ్వని సరిగా వినిపించని సమయంలో  సదరు వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునేందుకు విజువల్ స్పీచ్ రికగ్నిషన్ టెక్నాలజీ ని ఉపయోగించి మాటలను గుర్తించేందుకు  ఈ కొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచినట్లు ప్రొఫెసర్ రిచర్డ్ హార్వే, డాక్టర్ హెలెన్ ఎల్ బీర్  లు చెప్తున్నారు. రికార్డు చేసిన ఆడియోలు, ధ్వని, మాటలు, సీసీ టీవీ ఫుటేజ్ లోని ఆధారాలు... సంభాషణలు సరిగా అర్థంకాని సమయంలో ఈ టెక్నాలజీ వినియోగించవచ్చని పరిశోధకులు చెప్తున్నారు. లిప్ రీడింగ్ టెక్నాలజీని మరింత అభివృద్ధి పరచి, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు దృశ్య సంభాషణ శాస్త్రంలో తాము మరింత పరశోధన జరుపుతున్నామని సైంటిస్టులు చెప్తున్నారు. శిక్షణా పద్ధతి ద్వారా మునుపటి లిప్ రీడింగ్ పద్ధతులను మెరుగు పరిచేందుకు తాము ప్రయత్నిస్తున్నామని డాక్టర్ బేర్ వివరించారు.  

సమర్థవంతంగా పెదాల కదలికలను చదివే వ్యవస్థ (లిప్ రీడింగ్) ను  నేర పరిశోధన నుంచీ ఎంటర్ టైన్ మెంట్ వరకు ప్రతి విషయానికీ వినియోగించవచ్చని పరిశోధకులు తెలిపారు. పిచ్ లో ఉన్నపుడు  ఫుడ్ బాల్ క్రీడాకారుల అరుపులు,  సంభాషణ తదితర ధ్వనులను సులభంగా గుర్తించేందుకు ఇప్పటికే లిప్ రీడింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. అయితే కార్లు, ఎయిర్ క్రాఫ్ట్ కాక్ పిట్లు వంటి శబ్దాల స్థాయి ఎక్కువగా ఉండే పరిస్థితుల్లో ఈ కొత్త  టెక్నాలజీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు.  వినికిడి శక్తి లేనివారు వినియోగించే స్పీచ్ ఇంపెయిర్మెంట్స్ కు  ప్రత్యామ్నాయంగా ఈ లిప్ రీడింగ్ టెక్నాలజీతో అత్యధిక ప్రయోజనాలు ఉంటాయని డాక్టర్ బేర్ చెప్తున్నారు.

పెదవుల కదలికల ద్వారా రూపాన్ని, ఆకారాన్ని గుర్తించడం అనేది పెద్ద సమస్యగా కనిపించినా ఓ క్రమ పద్ధతిలో ఈ మెషీన్ల కు పెదాల కదలికలు, ఆకారాన్ని బట్టి  శిక్షణ ఇవ్వడం ద్వారా అది సాధ్యమౌతుందని హార్వే అన్నారు. ధ్వనిశాస్థ్రం, స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ పై షాంఘై లో జరిగే అంతర్జాతీయ సదస్సులో తమ  పరిశీలనలను  సమర్పించనున్నారు. ఐఈఈఈ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అకౌస్టిక్స్ - స్పీచ్ అండ్ సిగ్నల్ ప్రాసెసింగ్ 2016 జర్నల్ ప్రొసీడింగ్స్ లో పరిశోధనా వివరాలను  ప్రచురించారు.

మరిన్ని వార్తలు