'ఆమె కోమాలో లేదు' | Sakshi
Sakshi News home page

'ఆమె కోమాలో లేదు'

Published Fri, Mar 25 2016 2:03 PM

'ఆమె కోమాలో లేదు'

ముంబై: బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో గాయపడిన ఇన్‌-ఫ్లైట్‌ మేనేజర్‌ నిధి చాపేకర్‌ కోమాలో ఉన్నట్టు వచ్చిన వార్తలను జెట్ ఎయిర్ వేస్ తోసిపుచ్చింది. ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారని, ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని జెట్ ఎయిర్ వేస్ తెలిపింది. నిధి చాపేకర్‌ చికిత్స పొందుతున్న ఆస్పత్రిలోని వైద్యుడు డాక్టర్ స్టీవ్ తో తాము మాట్లాడామని వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.

ముంబై నివాసితురాలైన నిధి చాపేకర్‌ ముంబయి-బ్రసెల్స్‌ జెట్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో ఇన్‌-ఫ్లైట్‌ మేనేజర్‌గా పనిచేస్తోంది. సోమవారం బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన జంట పేలుళ్లలో ఆమె గాయపడింది. పేలుడు తర్వాత కాళ్లకి తీవ్రగాయాలతో రక్తమోడుతున్న ముఖం, చీలికలైన పసుపు దుస్తులూ, షాక్ నుంచి తేరుకోని చూపులతో ఉన్న నిధి ఫొటోను మీడియా సంస్థలు ప్రధానంగా చూపాయి. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement