స్మార్ట్ హెడ్‌లైటుతో ప్రమాదాలకు చెక్!

12 Sep, 2014 03:22 IST|Sakshi
స్మార్ట్ హెడ్‌లైటుతో ప్రమాదాలకు చెక్!

రాత్రిపూట ఎదురుగా వచ్చే వాహనాల డ్రైవర్లకు హెడ్‌లైట్ల వెలుతురు కారణంగా కళ్లు చెదిరిపోవడం వల్లే ఇప్పటికీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అందుకే.. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీకి చెందిన భారత సంతతి అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీనివాస నరసింహన్ బృందం సరికొత్త స్మార్ట్ హెడ్‌లైట్‌ను ఆవిష్కరించింది. పది లక్షల సూక్ష్మ కాంతిపుంజాలను విడుదల చేసే ఈ హెడ్‌లైట్.. ఎదురుగా వస్తున్న వాహనాలను గమనిస్తూ కాంతిపుంజాలను నియంత్రించుకుంటుంది.
 
  డ్రైవర్ల కళ్లు చెదిరిపోయేంత తీవ్రంగా కాంతి పడకుండా కొన్ని కాంతి పుంజాల విడుదలను ఆపుతుంది. హెడ్‌లైటు నుంచి వెలువడే కాంతి పెద్దగా తగ్గకుండానే.. ఎదుటివారి కళ్లు చెదరకుండా చేస్తుంది. అలాగే వర్షం, మంచు కురుస్తుంటే గనక.. రోడ్డు స్పష్టంగా కనిపించేలా చేయడం కోసం కూడా కాంతిపుంజాలను సరిచేసుకుంటుంది. వాహనంపై అమర్చే ఓ కెమెరా, కంప్యూటర్ సాయంతో ఇది వేగంగా పనిచేస్తుంది.

మరిన్ని వార్తలు