నడిసముద్రంలో చిక్కుకున్న నౌక

25 Mar, 2019 03:41 IST|Sakshi
అలల ధాటికి భారీ శిలలున్న తీరంవైపుకు కొట్టుకొస్తున్న నౌక

హెలికాప్టర్ల ద్వారా వందలాది ప్రయాణికుల తరలింపు

ఓస్లో: నార్వేతీరంలోని సముద్రంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు ఆదివారం కూడా కొనసాగాయి. ఇప్పటివరకు 397 మంది ప్రయాణికులను హెలికాప్టర్ల ద్వారా తరలించారు. దక్షిణ తీర ప్రాంతంలో ఉన్న ట్రోంసో నుంచి స్టావంగర్‌కు వెళ్తున్న విలాసవంతమైన ఓడలో 1,373 మంది ఉన్నారు. శనివారం ఓడలోని ఇంజిన్లలో సమస్యలు తలెత్తి విద్యుత్‌ సరఫరాలో ఆటంకం ఏర్పడింది. కెప్టెన్‌ అప్రమత్తమై అధికారులకు సమాచారమిచ్చారు. ప్రయాణికులను సముద్రం ఒడ్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు హెలికాప్టర్లు పంపారు.

ఇప్పటిదాకా 397 మందిని తరలించారు. బలమైన గాలులు వీస్తున్నా, ప్రమాదకర వాతావరణపరిస్థితులు ఉన్నా హెలికాప్టర్‌ ద్వారా ప్రయాణికుల చేరవేత కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. ఓడలోని
నాలుగు ఇంజిన్లలో మూడింటిని సిబ్బంది మరమ్మతు చేశారు. ఓస్లోకు వాయవ్య దిశలో సుమారు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోల్డె పోర్టుకు ప్రయాణికుల తరలింపు కార్యక్రమం కొనసాగుతోంది.  


లైఫ్‌ జాకెట్లతో నౌకలో బిక్కుబిక్కుమంటున్న ప్రయాణికులు

మరిన్ని వార్తలు