హసీనాకు త్రుటిలో తప్పిన బాంబు ప్రమాదం

8 Mar, 2015 03:04 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా శనివారం బాంబు పేలుళ్ల నుంచి త్రుటిలో తప్పించుకున్నారు.  ఢాకాలోని రద్దీ వాణిజ్య ప్రాంతం కార్వాన్ బజార్ గుండా ప్రధాని కాన్వాయ్ వెళ్లిన 10 నిమిషాల తర్వాతే, అక్కడ బాంబు పేలుళ్లు సంభవించాయి. బంగ్లా జాతిపిత, ఆమె తండ్రి షేక్ ముజీబుర్ రెహ్మాన్ 1971లో చేసిన చారిత్రక ప్రసంగాన్ని పురస్కరించుకొని అవామీ లీగ్ ఏర్పాటు చేసిన ర్యాలీకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఒక పోలీసు అధికారి స్వల్పంగా గాయపడ్డారు. విపక్షాలు దేశవ్యాప్తంగా రవాణా దిగ్బంధానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఈ పేలుళ్లు సంభవించాయి.

మరిన్ని వార్తలు