ఉగ్ర సయీద్‌ దోషే

12 Dec, 2019 02:43 IST|Sakshi

నిర్ధారించిన పాకిస్తాన్‌ కోర్టు

లాహోర్‌: ముంబై ఉగ్రదాడుల వ్యూహకర్త, నిషేధిత ఉగ్రవాద సంస్థ జమాత్‌ ఉద్‌ దావా అధ్యక్షుడు హఫీజ్‌ సయీద్‌ను పాకిస్తాన్‌ కోర్టు ఒకటి దోషిగా ప్రకటించింది. పంజాబ్‌ ప్రాంతంలోని పలు నగరాల్లో సయీద్‌ ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించారని స్పష్టం చేస్తూ యాంటీ టెర్రరిజమ్‌ కోర్టు జడ్జి మాలిక్‌ అర్షద్‌ భుట్టా తీర్పునిచ్చారు. పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన ఉగ్రవాద వ్యతిరేక విభాగం ఈ ఏడాది జూలైలో సయీద్, అతడి అనుచరులపై ఈ కేసు దాఖలు చేసింది. హఫీజ్‌ సయీద్‌ను అరెస్ట్‌ చేసి కోట్‌ లఖ్‌పత్‌ జైల్లో ఉంచింది. పంజాబ్‌తోపాటు లాహోర్, గుజ్రన్‌వాలా, ముల్తాన్‌ నగరాల్లో ఉగ్రవాదానికి ఆర్థిక సాయం అందించే లక్ష్యంతో సయీద్, అతడి అనుచరులు నిధులు సేకరించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు