రూ. 2,400 కోట్ల పూచీకత్తు ఇవ్వండి

12 Dec, 2019 02:42 IST|Sakshi

కేంద్రాన్ని కోరిన ఎయిరిండియా

న్యూఢిల్లీ: తీవ్ర నిధుల కొరత ఎదుర్కొంటున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) కొత్తగా మరిన్ని రుణాలు సమీకరించే ప్రయత్నాల్లో పడింది. నిర్వహణ అవసరాల కోసం కావాల్సిన నిధులను సమీకరించుకునేందుకు రూ.2,400 కోట్ల మేర పూచీకత్తు ఇవ్వాలని కేంద్రాన్ని కోరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇవ్వనున్న దాదాపు రూ.7,600 కోట్ల గ్యారంటీలోనే ఇది భాగంగా ఉండనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. రుణాలు, నష్టాలతో కుదేలవుతున్న ఎయిరిండియాను విక్రయించేందుకు కేంద్రం కసరత్తు చేస్తుండటం తెలిసిందే. 2018–19లో ఎయిరిండియా సుమారు రూ.8,556 కోట్ల నష్టాలు నమోదు చేసింది. కంపెనీ మూతబడకుండా కార్యకలాపాలు కొనసాగించేందుకు 2011–12 నుంచి కేంద్రం ఇప్పటిదాకా రూ.30,520 కోట్ల మేర తోడ్పాటు అందించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు