‘పై’ ఒక్కటున్ననుచాలు..

20 Sep, 2017 00:59 IST|Sakshi
‘పై’ ఒక్కటున్ననుచాలు..
ఫోనుకు ఒకటి.. ల్యాప్‌టాప్‌కు ఇంకోటి.. ట్యాబ్లెట్‌కు మరొకటి ఇలా ఎన్ని చార్జర్లని వాడుతాం చెప్పండి.. ఇకపై వాటన్నింటితో పనిలేకుండా ‘పై’ఛార్జర్లు వచ్చేస్తున్నాయి. ఫొటోలో నల్లగా మెరిసిపోతోందే అదే ‘పై’చార్జర్‌. టేబుల్‌పై ఒక్కటుంటే చాలు.. మన ఎలక్ట్రానిక్‌ వస్తువులు అడుగు దూరంలో ఎక్కడ ఉంచినా చార్జ్‌ అయిపోతాయి.

ఈ వైర్‌లెస్‌ చార్జింగ్‌ కోసం ప్రస్తుతం ఐఫోన్, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్న టెక్నాలజీతోనే ఇది కూడా పనిచేస్తుంది. కాకపోతే ఇందులో విద్యుచ్ఛక్తి ప్రసారం మొత్తం అయస్కాంత తరంగాల రూపంలో ఉంటుంది. అన్నీ సవ్యంగా సాగితే ఇంకో ఏడాది లోపు అందరికీ అందుబాటులోకి వచ్చేస్తాయి. ధర 200 డాలర్ల కంటే తక్కువే ఉంటుందని చెబుతున్నారు. లిక్సిన్‌ షీ, జాన్‌ మెక్‌డొనాల్డ్‌ కలసి ఈ చార్జర్‌ను అభివృద్ధి చేశారు. 

మరిన్ని వార్తలు