ట్విటరే లేకపోతే..!: ట్రంప్‌

18 Oct, 2018 04:15 IST|Sakshi

వాషింగ్టన్‌: నకిలీ వార్తలను ఎదుర్కొనేందుకు సోషల్‌ మీడియా, ముఖ్యంగా ట్విటర్‌ తనకెంతో ఉపయోపడ్తోందని అమెరికా ఆధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ట్విటరే లేకపోతే నకిలీ వార్తలపై వివరణ ఇచ్చేందుకు గంటకో ప్రెస్‌ కాన్ఫెరెన్స్‌ పెట్టాల్సి వచ్చేదన్నారు. ‘ట్వీట్‌ చేయడం నాకిష్టం. వాస్తవాలను సోషల్‌ మీడియా ద్వారానే నేను చెప్పాలనుకుంటాను. అయితే, నాకు విలేకరుల సమావేశాలు అన్నా కూడా ఇష్టమే. కానీ అర్థం, పర్థం లేని ప్రశ్నలడిగితేనే కొట్టాలనిపిస్తుంది’ అన్నారు. ‘నిన్న ఏపీ వార్తాసంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను. నేను చెప్పింది ఒకటి. వారు రాసింది మరొకటి. హెడింగ్‌ అయితే మరీ దారుణం’ అని ట్రంప్‌ విమర్శించారు. రానున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లే గెలుస్తారన్నారు.

మరిన్ని వార్తలు