బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్

21 Jun, 2014 20:23 IST|Sakshi
బర్త్ డే గిఫ్ట్గా హెలికాప్టర్

లండన్: ఇంగ్లండ్ రాణి ఎలిజబెత్ 2 తన మనువడు ప్రిన్స్ విలియమ్ పుట్టిన రోజు కానుకగా ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. ఎలిజబెత్ దాదాపు 80 కోట్ల రూపాయిల విలువైన హెలికెప్టర్ను విలియమ్ కు  బర్త్ డే గిఫ్ట్ ఇవ్వనున్నారు.

విలియమ్ ఆదివారం 33వ ఏట అడుగుపెట్టనున్నారు. అన్నట్టు విలియమ్ ఆర్ఏఎఫ్ హెలికెప్టర్ ఫైలట్. ప్రిన్స్ విలియమ్, ఆయన భార్య కేట్ మిడిల్టన్ దంపతులకు ఆగస్టా ఎ 109 ఎస్ ఎయిర్ క్రాఫ్ట్ ఉంది. అధికారిక కార్యక్రమాలకు దీన్ని ఉపయోగిస్తుంటారు. కాగా విలియమ్ ఆగస్టాను నడపగలరా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.

మరిన్ని వార్తలు