పక్కనే ఉన్నా పసిగట్టలేకపోయారు..

11 Mar, 2019 11:23 IST|Sakshi

న్యూయార్క్‌ : తాలిబన్‌ వ్యవస్ధాపకుడు ముల్లా మహ్మద్‌ ఒమర్‌ అలియాస్‌ ముల్లా ఒమర్‌ అమెరికా సైనిక శిబిరాలకు అత్యంత చేరువలోని రహస్య గదిలో ఉన్నా అమెరికన్‌ దళాలు గుర్తించలేదని ఇటీవల విడుదలైన ఓ పుస్తకం వెల్లడించింది. ఆప్ఘనిస్తాన్‌లోని అమెరికా శిబిరాలకు నడక దూరంలోనే ముల్లా ఒమర్‌ ఏళ్ల తరబడి నివసిస్తున్నారని ఈ పుస్తకం అమెరికన్‌ ఇంటెలిజెన్స్‌ ఘోరవైఫల్యాన్ని ఎత్తిచూపింది.

గతంలో ముల్లా తలదాచుకున్న ఈ ఇంటిపై అమెరికా దళాలు సోదాలు చేపట్టినా ఇందులో ఆయన కోసం నిర్మించిన రహస్య గదిని అవి పసిగట్టలేకపోయాయని పుస్తకంలోని అంశాలను ప్రచురించిన  గార్డియన్‌, వాల్‌స్ర్టీట్‌ జర్నల్‌ కథనాలు వెల్లడించాయి. అమెరికా ట్విన్‌ టవర్స్‌పై దాడి అనంతరం ఒమర్‌ తలపై అగ్రదేశం కోటి డాలర్ల రివార్డును ప్రకటించింది.

కాగా అల్‌ఖైదా నేత ఒసామా బిన్‌ లాడెన్‌ మాదిరిగానే ఒమర్‌ సైతం పాకిస్తాన్‌లో తలదాచుకున్నాడని అమెరికా భావిస్తోంది. 2006 నుంచి ఆప్ఘనిస్తాన్‌ కేంద్రంగా వార్తలు అందిస్తున్న డచ్‌ జర్నలిస్ట్‌ బెటే డామ్‌ ప్రచురించిన ఈ పుస్తకంలో పొందుపరిచిన అంశాలు దుమారం రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు