పేపర్ ముక్కతో 14 లక్షలు కొట్టేశాడు!

8 Jul, 2016 16:21 IST|Sakshi
పేపర్ ముక్కతో 14 లక్షలు కొట్టేశాడు!

సింగపూర్: ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా బ్యాంకు నుంచి దాదాపు రూ.14 లక్షలు (22 వేల డాలర్లు) ఎత్తుకుపోయిన దొంగను పట్టుకునేందుకు సింగపూర్ పోలీసులు గాలింపు జరుపుతున్నారు. కేవలం ఒక పేపర్ ముక్కతో బ్యాంకును బురిడీ కొట్టించిన మోసగాడిని ఆస్ట్రేలియన్ గా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం భోజన సమయంలో స్టాండర్డ్  ఛార్టెడ్ బ్యాంకు వచ్చిన నిందితుడు తన డిమాండ్లను ఒక కాగితంపై రాసి బ్యాంకు సిబ్బందికి ఇచ్చాడు. కొద్ది నిమిషాల తర్వాత 22 వేల డాలర్ల సొమ్ముతో బ్యాంకు నుంచి బయటకు వెళ్లిపోయాడని దర్యాప్తు సంస్థ సన్నిహిత వర్గాలు వెల్లడించినట్టు స్థానిక మీడియా పేర్కొంది.

దుండగుడు ఎటువంటి ఆయుధం ఉపయోగించకుండా ఎలా దొంగతనం చేశాడనే దానిపై దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఆసియాలో సురక్షితమైన దేశంగా పేరుగాంచిన సింగపూర్ లో బ్యాంకు చోరీలు చాలా అరుదు. నేరస్తుల పట్ల, తుపాకీ సంస్కృతి పట్ల కఠినంగా వ్యవహరిస్తుండడంతో సింగపూర్ లో నేరాలు తక్కుగా నమోదవుతుంటాయి. 2008, నవంబర్ లో ఓ వ్యక్తి బ్యాంకు దొంగతనానికి విఫలయత్నం చేశాడు.

మరిన్ని వార్తలు