ఆ వీడియోలు ఇక వద్దంటూ యాప్పై దావా! | Sakshi
Sakshi News home page

ఆ వీడియోలు ఇక వద్దంటూ యాప్పై దావా!

Published Fri, Jul 8 2016 4:12 PM

ఆ వీడియోలు ఇక వద్దంటూ యాప్పై దావా! - Sakshi

న్యూయార్క్: పాపులర్ మొబైల్ యాప్ స్నాప్ ఛాట్ పై ఓ తల్లీకొడుకులు కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఫ్రెండ్స్, బంధువులు, సన్నిహితులు ఇలా ఎవరికైనా సందేశాలు, వీడియోలు పంపించేందుకు వినియోగించే ఈ యాప్ అశ్లీలాన్ని అడ్డుకోలేక పోతుందని ఆ తల్లీకొడుకులు ఆరోపించారు. స్నాప్ ఛాట్ లో అశ్లీల ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయని, వీటి వల్ల యువత చెడిపోతుందని సెంట్రల్ కాలిఫోర్నియాలోని డిస్ట్రిక్ట్ కోర్టులో పిల్ దాఖలైందని మార్క్ గెరాగస్ అనే న్యాయవాది తెలిపారు.

ఓ బాలుడు డిస్నీ కార్టూన్లను అశ్లీల రూపంలో తయారుచేయడంతో పాటు వాటిని శృంగారంలో పాటిస్తారని, ఎప్పూడూ సెక్స్ చేయని వాళ్లు చూడండి అంటూ పోస్ట్ చేయడాన్ని ఆమె తీవ్రంగా వ్యతిరేకించారు. మరోవైపు స్నాప్ ఛాట్ అధికార ప్రతినిధి ఈ విషయంపై స్పందిస్తూ.. పిల్ దాఖలైన విషయం నిజమే, ప్రజలు కోరినట్లుగా అశ్లీల డాటా వచ్చినప్పుడు హెచ్చరికలు జారీ చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కమ్యునికేషన్స్ డీసెన్సీ యాక్ట్ 1996 ప్రకారం పోర్న్ వీడియోలు, వాటికి సంబంధించి ఎలాంటి సమాచారం ఇంటర్ నెట్లో పోస్ట్ అవకూడదని తెలిపారు. కనీసం పిల్లలు అయినా ఈ యాప్ యూజ్ చేస్తున్నప్పుడు వారి వయసు ఆధారంగా వారికి కనిపించకుండా ఉండేలా తగిన చర్యలు అయినా తీసుకోవాలని లాయర్ మార్క్ గెరాగస్ సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement