భారత్ ఆరోపణలను కొట్టిపారేసిన లంక ప్రధాని

1 Sep, 2017 18:31 IST|Sakshi
భారత్ ఆరోపణలను కొట్టిపారేసిన లంక ప్రధాని
  • పరాయి దేశాల సైన్యం కోసం కాదు: విక్రమ సింఘె
  • కొలంబో: శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టు ఏ ఇతర దేశాల సైనిక స్థావరం కాదని ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమ సింఘె స్పష్టం చేశారు. చైనా నావికా దళాల సంఖ్య ఈ పోర్టులో పెరుగుతోందన్న భారత్‌వర్గాల ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ పోర్టులో 70 శాతం వాటాను చైనాకు 99 ఏళ్ల లీజుకు ఇస్తూ ఒప్పందం చేసుకోగా చైనా మర్చంట్‌ పోర్టు హోల్డింగ్స్‌ (సీఎంపోర్టు) పోర్టు అభివృద్ధికి అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు.

    ఈ పోర్టు చైనా నావికాదళానికి ఏ మాత్రం ఉపయోగపడేలా లేకపోవడంతో ఈ ఒప్పందం అమలులో గత కొంతకాలం నుంచి జాప్యం జరుగుతోంది. గత రాత్రి జరిగిన ఇండియన్ ఓషియన్ కాన్ఫరెన్స్‌లో అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మాట్లాడుతూ.. ఏ దేశంతోనూ తాము మిలిటరీ సహకారాన్ని పొందబోమని, తమ ప్రాంతాలను వారు వాడుకోవడానికి కూడా అంగీకరించబోమని భారత్‌ ఆందోళన నేపథ్యంలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. తమ పోర్టులు, ఎయిర్‌ పోర్టులలో సైనిక కార్యకలాపాలను శ్రీలంక సేనలు మాత్రమే చూసుకుంటాయని చెప్పారు. పోర్టుల్లో వాణిజ్య కార్యకలాపాల అభివృద్ధికి విదేశీ ప్రైవేటు పెట్టుబడిదారుల సహాయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు.

మరిన్ని వార్తలు