బాబ్రీ మసీదుపై సున్నీ వక్ఫ్‌ బోర్డు కొత్త ట్విస్ట్‌

6 Dec, 2017 15:18 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో సున్నీ వక్ఫ్‌ బోర్డు కొత్త ట్విస్ట్‌ ఇచ్చింది. బాబ్రీ మసీదు విచారణను వాయిదావేయాలన్న ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌తో సున్నీ వక్ఫ్‌ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పటికే సుదీర్ఘకాలంగా సాగుతున్న ఈ వివాదానికి సత్వరమే ముగింపు పలకాలని సున్నీ వక్ప్‌ బోర్డు సభ్యుడు హాజీ మెహబూబ్‌ కోరారు. ఎన్నికల కారణంగా విచారణను 2018 ఫిబ్రవరికి వాయిదా వేయించడంపైనా ఆయన అసహనం వ్యక్తం చేశారు.


మందిర్‌ - మసీదు కేసులో కపిల్‌ సిబల్‌ కాంగ్రెస్‌ నాయకుడిగానే సుప్రీం‍కోర్టులో వాదించారని, ఆయనతో వక్ఫ్‌ బోర్డుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. మంగళవారం రామజన్మ భూమి-మసీదుపై సుప్రీంలో విచారణ జరగాల్సి ఉండగా.. సున్నితమైన అంశం అంటూ ఫిబ్రవరి వరకూ వాయిదా వేయాలని సిబల్‌ సుప్రీంలో వాదించారు. అంతేకాక 2019 లోక్‌సభ ఎన్నికల వరకూ ఈ విచారణ వాయిదా వేయాలని ఆయన సుప్రీంను కోరారు.


అయోధ్య వివాదం పూర్తిగా రాజకీయం అయిం‍దని.. ఇప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా.. రాజకీయాలను పూర్తిగా ప్రభావితం చేస్తుందని కోర్టుకు సిబల్‌ తెలిపారు. బీజేపీ 2014 లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని చేర్చిందని ఆయన కోర్టుకు తెలిపారు.

మరిన్ని వార్తలు