చైనా తీరాన్ని ముంచెత్తిన సూపర్ టైఫూన్

1 Oct, 2015 14:06 IST|Sakshi

బీజింగ్: సూపర్ టైఫూన్ దుజువాన్ చైనా తీరాన్ని ముంచెత్తింది. తీర ప్రాంతాలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా జిజియాంగ్, ఫుజియాన్ ప్రాంతాలు ధ్వంసమయ్యాయని స్థానిక మీడియా వెల్లడించింది. ఒకే ఏడాదిలో ఇది 21వ టైఫూన్. దీనివల్ల ప్రాణనష్టం తక్కువగానే(ఇద్దరు దుర్మరణం) జరిగినా గాయపడిన వారు మాత్రం అధికంగానే (324మంది) ఉన్నారు.

ఆస్తి నష్టం మాత్రం భారీగా సంభవించింది. తమ స్వస్థలాలను దాదాపు 4,30, 200 మంది ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. ప్రత్యక్షంగా 2.4 బిలియన్ యువాన్ల నష్టం సంభవించిందని, 400 నివాసాలు ధ్వంసం అయ్యాయి. 31వేల హెక్టార్లలో పంట నష్టం చోటుచేసుకుంది. అయితే, గురువారం నాటికి కొంత మేరకు వర్షాలు తగ్గిపోయి వరదలు మాత్రం కొనసాగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు